మూడు ప్రధాన వాణిజ్యపంటల సాగులో ఆంధ్రప్రదేశ్ తొలి 4స్థానాల్లో నిలిచింది. కోకో సాగులో 1, జీడిపప్పు 2, కొబ్బరిలో 4వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి భగీరథ్ చౌదరి 2026, మార్చి 13న రాజ్యసభలో తెలిపారు.
దేశవ్యాప్తంగా కోకో 1.14 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా అందులో 47.06 వేలహెక్టార్లు (41%) ఏపీలో సాగువుతున్నట్లు చెప్పారు. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక ఉన్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా జీడిపప్పు 1,204వేల హెక్టార్లలో సాగవుతుండగా 223వేల హెక్టార్లతో ఒడిశా తొలిస్థానంలో, 201వేల హెక్టార్లతో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.
కొబ్బరి సాగులో కేరళ తొలి స్థానంలో నిలవగా, కర్ణాటక, తమిళనాడు తర్వాతి స్థానాల్లో, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నట్లు వివరించారు.