రాష్ట్ర ఆదాయం రూ.1,59,501 కోట్లు

రాష్ట్ర ఆదాయం రూ.1,59,501 కోట్లు
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో తాజా గణాంకాల మేరకు ప్రత్యేక మార్జిన్‌తో కలిపి రాష్ట్రానికి రూ.1,59,501 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చినెల రెండోవారం ప్రారంభం నాటికి ఇంత రాబడి సాధ్యమయింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) కంటే ఇది 6 శాతం అధికం. రాష్ట్ర సొంత రాబడి రూ.93,208 కోట్లు. ప్రత్యేక మార్జిన్‌తో కలిపి లెక్కించే ఈ ఆదాయం గత ఏడాది కన్నా 4 శాతం అధికంగా ఉంది. ఇందులో సొంత పన్నుల ద్వారా రూ.79,684 కోట్లు (3% అధికం) పన్నేతర రాబడి రూ.5,216 కోట్లు (13% అధికం) ప్రత్యేక మార్జిన్‌ రూ.8,486 కోట్లుగా (11% అధికం)ఉంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram