దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఏర్పాటు కానుంది. సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని నెలకొల్పుతోంది. ఈ సెంటర్ నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 2024, మార్చి 12న శంకుస్థాపన చేశారు.
ఈ సెంటర్‌లో మానవ రహిత నౌకలు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, ఏఐ ఆధారిత సముద్ర పర్యవేక్షణ వ్యవస్థలు, నేవిగేషన్ సాంకేతికతలను రూపొందిస్తారు.