రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్‌గా కాకినాడకు చెందిన వెటుకూరి ఏవీఎస్‌ఎస్‌ఎన్ రాజుని ప్రభుత్వం 2026, మార్చి 11న నియమించింది. సభ్యులుగా కేవీ వెంకట పద్మలత (గుంటూరు జిల్లా), దోని శ్రీనివాసమూర్తి (శ్రీసత్యసాయి జిల్లా), వి.గాంధీబాయి (అల్లూరి), చల్లా మధుసూదనరావు (గుంటూరు), ఎంజీ సూర్యనారాయణ (కాకినాడ), బి.పద్మావతి (రాజమహేంద్రవరం) నియమితులయ్యారు.