పంచాయతీల పునర్‌ వర్గీకరణ

పంచాయతీల పునర్‌ వర్గీకరణ
  • ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల పునర్‌ వర్గీకరణను ప్రభుత్వం ఆమోదిస్తూ 2026, మార్చి 9న ఉత్తర్వులిచ్చింది. జనాభా, పంచాయతీ ఆదాయం ఆధారంగా వీటిని పునర్‌ వర్గీకరించారు. ఇప్పుడున్న మూడు రకాల గ్రామపంచాయతీలు.. ఇకపై నాలుగు రకాలు కానున్నాయి. ఇందులో ఒక దాన్ని కొత్తగా రూర్బన్‌ పంచాయతీగా నిర్ణయించారు.
  • ఇక్కడ పట్టణ తరహా సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఇటీవల ఆదేశించారు. దీనిపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై పంచాయతీల పునర్‌ వర్గీకరణను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram