ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా సి.శశిధర్ 2025, అక్టోబరు 10న అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్‌పర్సన్ అనురాధ పదవీకాలం పూర్తి కావడంతో సభ్యుడిగా ఉన్న శశిధర్‌కు ప్రభుత్వం ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కమిషన్ సభ్యురాలు బీఎస్ సెలీనా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శశిధర్ బాధ్యతలు చేపట్టారు.