2025-26లో భారత వృద్ధి 7.5%

2025-26లో భారత వృద్ధి 7.5%
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదుకావొచ్చని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ (2026-27) వృద్ధి అంచనాలను 6.7 శాతానికి పెంచింది. 2026లో అంతర్జాతీయంగా ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 70 డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4%, 2026-27లో 6.4% వృద్ధిరేటును గత డిసెంబరులో ఫిచ్‌ అంచనా వేసింది. 2026-27 ప్రథమార్థంలో వృద్ధి నెమ్మదించొచ్చని గ్లోబల్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌-  2026లో అభిప్రాయపడింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram