2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మనదేశం నుంచి 20.48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే సమయ ఎగుమతుల కంటే ఇవి 6.5% ఎక్కువ. మన ఔషధాల ఎగుమతులు బ్రెజిల్, నైజీరియా దేశాలకు వేగంగా పెరుగుతున్నాయి.
2024-25 ఇదే సమయంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాకు 17.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,600 కోట్ల) అధికంగా ఔషధాలు మనదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. మన దేశం నుంచి పెరిగిన ఔషధ ఎగుమతుల్లో ఈ వాటా 14%. మన ఔషధాల ఎగుమతులు వేగంగా పెరిగింది ఈ దేశానికే.