2025, అక్టోబరులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా 2,070 కోట్ల లావాదేవీలు జరిరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.27.28 లక్షల కోట్లు. 2016లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాక, ఒక నెలలో ఇంతటి స్థాయిలో లావాదేవీలు జరగడం ఇప్పుడే.
2025 సెప్టెంబరులో 1,963 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.24.9 లక్షల కోట్లు. వీటితో పోలిస్తే అక్టోబరులో లావాదేవీల సంఖ్య 5.6%, విలువ 10% పెరిగింది.