2026 ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబయిలను వేదికలుగా బీసీసీఐ ఖరారు చేసింది. ఇంకొన్ని వేదికలను ఎంపిక చేయాల్సివుంది. ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. మొత్తం 10 వేదికల్లో టోర్నీని నిర్వహిస్తారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా అహ్మదాబాద్‌లోనే జరిగింది.