దేశవ్యాప్తంగా 2026, మార్చి 14న నిర్వహించిన 2026 సంవత్సరం తొలి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2,84,14,329 కేసులు పరిష్కరించి రూ.10,920 కోట్ల మేరకు వివాద సెటిల్మెంట్ పూర్తి చేసినట్లు జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ (నల్సా) తెలిపింది. ఇందులో 2,57,82,254 కేసులు వివాదం ప్రాథమిక దశలో ఉన్నవి కాగా 26,32,075 కేసులు పెండింగ్‌లో ఉన్నవి అని పేర్కొంది.
నల్సా పేట్రన్ ఇన్ చీఫ్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది.