ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2025, అక్టోబరు 1న దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.1,20,107 కోట్ల విలువైన పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. రబీ సీజన్‌లో ప్రధానంగా పండించే ఆరు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచింది. దీనివల్ల రూ.84,263 కోట్ల మేర రైతులకు ప్రయోజనం కలగనుంది.
పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధన కోసం రూ.11,440 కోట్లతో ప్రత్యేక మిషన్‌ను ప్రకటించింది. కాలపరిమితి ఆరేళ్లు. 2025-26 నుంచి 2030-31 వరకు ఉంటుంది.
రూ.5,863 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అనుమతిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 1,288 కేంద్రీయ విద్యాలయా(కేవీ)లకు అదనంగా మరో 57 ఏర్పాటు కానున్నాయి.