ప్రధాని నరేంద్ర మోదీతో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ 2026, జనవరి 19న దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. మెగా వ్యూహాత్మక రక్షణ బంధం దిశగా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అడుగులు వేశాయి. దీంతోపాటు ఎల్‌ఎన్‌జీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2032 నాటికి రెండు దేశాల మధ్య 200 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.
పాక్, సౌదీల మధ్య రక్షణ బంధం కుదిరిన నేపథ్యంలో యూఏఈతో భారత్ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.