దుర్భర దారిద్య్రాన్ని (కడు పేదరికాన్ని) జయించిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. కేరళ రాష్ట్రంలోని వామపక్ష కూటమి(ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం 2021లో దుర్భర దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాన్ని (ఈపీఈపీ) ప్రకటించింది. నవంబరు 1న, ఆ రాష్ట్ర 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాము ఆ లక్ష్యాన్ని 100శాతం సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దుర్భర దారిద్య్రం నుంచి 64వేల కుటుంబాలకు విముక్తి కల్పించినట్లు తెలిపింది. కనీస అవసరాలైన ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, ఉపాధి మార్గాలను వారందరికీ సమకూర్చినట్లు వెల్లడించింది.
కొట్టాయం, కన్నూర్ జిల్లాలు...ఈపీఈపీ అమలులో అగ్రస్థానంలో నిలిచాయి.