దేశ జనాభా 142.58 కోట్లు

దేశ జనాభా 142.58 కోట్లు
  • ప్రస్తుతం దేశజనాభా 142.58 కోట్లు అని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో పురుషులు 73.20 కోట్లు, మహిళలు 69.38 కోట్లు. జనాభా ఏటా కోటి మంది చొప్పున 2036 నాటికి మరో 10 కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది. ‘‘భారతదేశంలో పురుషులు-మహిళలు-2025’’ అనే పేరుతో తాజాగా విడుదల చేసిన ఈ నివేదికలో పలు అంశాలు ప్రస్తావించింది. 
  • 2017-23 మధ్యకాలంలో దేశంలో ప్రతి 1000 మంది బాలురకు బాలికల సగటు 904 నుంచి 917కు పెరగడం ఆశాజనకమని స్పష్టంచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 914 కాగా.. పట్టణాల్లో 925.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram