కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
  • ప్రముఖ కవి, రచయిత, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 వరించింది. ఆయన రచించిన కవితా సంపుటి అనిమేషకు ఈ పురస్కారం లభించింది. అనిమేష అంటే రెప్పలు వాల్చనది అని అర్థం. కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొన్న సంక్షోభాలు, ఆ సందర్భంగా మానవ సంబంధాల విచ్ఛిన్నం, కూలీల కష్టాలు తదితర అంశాలను ఇతివృత్తాలుగా తీసుకొని అనిమేషలో హృద్యంగా కవితలు చిత్రీకరించారు సిధారెడ్డి.
  • తెలంగాణ ఆవిర్భావం తర్వాత భాషా సాహిత్యాల వికాసం కోసం ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి ఛైర్మన్‌గా సిధారెడ్డి సేవలందించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram