జ్ఞానపీఠ్‌

జ్ఞానపీఠ్‌
  • తమిళ రచయిత, సాహిత్యకారుడు ఆర్‌.వైరముత్తును 60వ జ్ఞానపీఠ్‌ పురస్కారం వరించింది. ప్రొఫెసర్‌ ప్రతిభా రే నేతృత్వంలో 2026, మార్చి 14న దిల్లీలో సమావేశమైన ‘భారతీయ జ్ఞానపీఠ్‌ పాలక మండలి’ సభ్యులు.. 2025కు సంబంధించిన పురస్కారానికి వైరముత్తును ఎంపిక చేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. 
  • తమిళ సినీ గీత రచయితగా సుప్రసిద్ధులైన వైరముత్తు 1953లో తమిళనాడులోని తేని జిల్లా మేట్టూర్‌లో జన్మించారు. వర్తమాన తమిళ సాహిత్య రంగానికి విశేష సేవలందించిన వ్యక్తిగా పేరుపొందారు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన ‘వైకరై మేఘంగళ్‌’ కవితా సంకలనం..అప్పట్లోనే ఓ మహిళా కళాశాలలో పాఠ్యాంశంగా మారింది.
  • విజేతకు రూ.11 లక్షల నగదు, సరస్వతి కాంస్య విగ్రహం, ప్రశంసపత్రం అందిస్తారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram