క్రాఫోర్డ్‌ ప్రైజ్‌

క్రాఫోర్డ్‌ ప్రైజ్‌
  • భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్‌ రామనాథన్‌(82)ను భూ విజ్ఞానశాస్త్రంలో నోబెల్‌గా భావించే క్రాఫోర్డ్‌ ప్రైజ్‌ వరించింది. కాలుష్య మేఘాలు, క్లోరోఫ్లోరో కార్బన్‌ (సీఎఫ్‌సీ)ల వంటి సూపర్‌ పొల్యూటెంట్లపై దశాబ్దాల పాటు చేసిన పరిశోధనకు ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. 
  • రామనాథన్‌ ‘నాసా’కు పనిచేస్తున్న సమయంలో కార్బన్‌డయాక్సైడ్‌ కంటే ఫ్రిడ్జ్‌లు, ఏరోసోల్స్‌లో ఉపయోగించే సీఎఫ్‌సీలే 10 వేల రెట్లు ఎక్కువగా భూ వాతావరణంలో ఉష్ణాన్ని పట్టి ఉంచుతాయని కనుగొన్నారు. దీంతో గ్లోబల్‌ వార్మింగ్‌కు కార్బన్‌ డయాక్సైడే ప్రధాన కారణమని అప్పటి వరకూ ఉన్న భావనను ఆయన సమూలంగా మార్చేసినట్లయింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram