అండమాన్ దీవుల సమీపంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ నిక్షేపాల పరిమాణం ఎంత అనేది ఇంకా అంచనా వేయలేదు. ఆఫ్‌షోర్ అండమాన్ బ్లాక్ ఏఎన్-ఓఎస్‌హెచ్‌పీ-2018/1లోని విజయపురం-2లో తవ్విన రెండో అన్వేషణ బావిలో సహజ వాయువును గుర్తించినట్లు నివేదించింది. దీన్ని కంపెనీ ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) కింద దక్కించుకుంది.