క్యాప్‌జెమిని ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరుగా ఉన్న సంజయ్ చాల్కేని ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సంస్థ నియమించింది. ఏడేళ్లుగా సీఈఓగా ఉన్న అశ్విన్ యార్ది పదవీ విరమణ చేయనున్నందున, ఆయన స్థానంలో చాల్కే రానున్నారు. 2026 జనవరి 1 నుంచి యార్ది క్యాప్‌జెమిని ఇండియా బోర్డుకి నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని సంస్థ పేర్కొంది.