ఇండో-అమెరికన్ రచయిత, భద్రతా నిపుణుడు పాల్ కపూర్.. అమెరికా విదేశాంగశాఖలో దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో కొత్త అసిస్టెంట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. భారత్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, మాల్దీవులు, తజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లలో అమెరికాకు సంబంధించిన దౌత్యపరమైన అంశాలను ఆయన పర్యవేక్షిస్తారు. కపూర్ తండ్రి భారతీయుడు. తల్లి అమెరికన్.