ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ ఆహార, వ్యవసాయ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) నిర్వహించిన ‘సీడ్ టు స్కేల్’ కార్యక్రమంలో క్రొవ్విడి మధులాష్‌బాబు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రోమ్ నగరంలోని ఎఫ్‌ఏఓ ప్రధాన కార్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నవోత్పత్తిదారులు, పరిశోధకులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రొవ్విడి మధులాష్‌బాబు ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయం, ఆవిష్కరణాత్మక అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించి, మూడో స్థానం సాధించారు.