ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక కృతి సనన్ బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా చరిత్ర సృష్టించారు. ఇటీవలే ఆమె ‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్’(యూఎన్‌ఎఫ్‌పీఏ) ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపియ్యారు. ఈ వేదికపై ‘మహిళల ఆరోగ్యం- ప్రపంచ సంపద’ అనే అంశంపై కృతి మాట్లాడారు.