ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం 

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహం 
  • భారత్‌ సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ (నావిక్‌)లో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారులు తెలిపారు. దీంతో ఈ వ్యవస్థ ద్వారా అందే నేవిగేషన్‌ సేవలు నిలిచిపోయాయి.
  • ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1-ఎఫ్‌ అనే ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న నింగిలోకి ప్రయోగించారు. అందులోని మూడు పరమాణు గడియారాల్లో రెండు ఇప్పటికే విఫలమయ్యాయి. చిట్టచివరి సాధనం తాజాగా మొరాయించింది. దీంతో ఆ శాటిలైట్‌.. దిక్సూచి సేవలకు అక్కరకు రాని పరిస్థితి తలెత్తింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram