దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన సర్వే నౌక ఐఎన్‌ఎస్ ఇక్షక్‌ను భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్‌కుమార్ త్రిపాఠి 2025, నవంబరు 6న కొచ్చిన్‌లో ప్రారంభించారు. నౌకాదళానికి, భారతీయ నౌకానిర్మాణ రంగానికి ఇదొక మైలురాయి అని, ఈ ఏడాది ఇలాంటి పది ప్రారంభోత్సవాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
కోల్‌కతాలో తయారైన ఇక్షక్‌లో అధునాతన పరికరాలు ఉన్నాయి.