రవూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పరిశోధకులు ఒక ఇంటెలిజెంట్ నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది సౌర, పవన, బ్యాటరీ వనరుల నుంచి ప్రవహించే విద్యుత్‌ను ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది. ఈ హైబ్రిడ్ మైక్రోగ్రిడ్.. ప్రధాన విద్యుత్ గ్రిడ్ వెసులుబాట్లు లేని గ్రామీణ ప్రాంతాలకు శుద్ధ, నిరంతర విద్యుత్ అందించడానికి సాయపడుతుందని పరిశోధకులు తెలిపారు. శిలాజ ఇంధన నిల్వలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను బ్యాటరీ నిల్వతో అనుసంధానం చేయాల్సిన చోట హైబ్రిడ్ మైక్రోగ్రిడ్‌లు అవసరం. ఇలాంటివాటిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుపుతున్నారు.