వరసగా నాలుగో సంవత్సరంలోనూ చైనాలో జనాభా తగ్గింది. 2015 నాటి పరిస్థితితో పోలిస్తే 2025లో దాదాపు కోటి మేర ఈ తగ్గుదల ఉంది. దంపతులకు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలాఏళ్లపాటు అమలుచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు.
జాతీయ గణాంకాల మండలి (ఎన్‌బీఎస్) 2026, జనవరి 19న విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాలో 2025లో 79.2 లక్షలమంది శిశువులు జన్మించారు. 2024లో ఇది 95.4 లక్షలుగా ఉంది. గత ఏడాది 1.13 కోట్లమంది చనిపోయారు. అయిదు దశాబ్దాల్లో ఇదే అత్యధికం.