ప్రపంచంలో తొలిసారిగా మాల్దీవులు ఒక తరాన్ని మొత్తాన్ని సిగరెట్లకు దూరం చేసేందుకు సిద్ధమైంది. 2007 జనవరి 1 తర్వాత పుట్టిన వారెవరూ సిగరెట్లు ముట్టుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన దేశ పౌరులకు మాత్రమే కాకుండా పర్యాటకులకూ వర్తిస్తుందని తెలిపింది. ఈ నిషేధం 2025, నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది.