ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం ఈజిప్టులో 2025, నవంబరు 1న ప్రారంభమైంది. కైరోలోని గాజా పిరమిడ్ల దగ్గర నిర్మించిన ఈ మ్యూజియం పూర్తవ్వడానికే దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. ఇందులో సుమారు 50 వేల వరకు కళా ఖండాలు ఉన్నాయి. ఇవన్నీ ఈజిప్టు పురాతన నాగరికతను ప్రతిబింబించేవే.
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసీ దీన్ని ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయమే.. దాదాపు 8,320 కోట్లు.