తెలంగాణ ఎల్‌పీసెట్-2026

తెలంగాణ ఎల్‌పీసెట్-2026

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో ఏడాది డిప్లొమా కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందేందుకు (Lateral Entry) నిర్వహించే 'ఎల్‌పీసెట్-2026' నోటిఫికేషన్‌ను ఎస్‌బీటీఈటీ (SBTET) విడుదల చేసింది. ఐటీఐ (ITI) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:

అర్హతలు: రెండేళ్ల ఐటీఐ కోర్సులో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET) నిర్వహించే బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు పూర్తి వివరాలను & దరఖాస్తు ఫారాన్ని www.sbtet.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 300 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించారు. పూరించిన దరఖాస్తులను, ఆన్‌లైన్ పేమెంట్ రసీదుతో కలిపి హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌కు సమర్పించి హాల్ టికెట్ పొందాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభం: 16-03-2026.

ఫీజు చెల్లింపు చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా): 20-04-2026 (సాయంత్రం 5 గంటల వరకు).

రూ.100 ఆలస్య రుసుముతో చివరి తేదీ: 21-04-2026.

దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీ: 22-04-2026.

పరీక్ష నిర్వహణ తేదీ: 15-05-2026.

ఫలితాల విడుదల: పరీక్ష జరిగిన 12 రోజుల్లోపు. మెరిట్ మార్కులు & అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ప్రవేశాల షెడ్యూల్ ఫలితాల తర్వాత ప్రకటిస్తారు.

Website:https://www.sbtet.telangana.gov.in/index.html#!/index

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram