హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) రూరల్ డెవెలప్‌మెంట్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పీహెచ్‌డీ ఇన్ రూరల్ డెవెలప్‌మెంట్ 2025-26
మొత్తం సీట్లు: 15
విభాగాలు: అడల్ట్ ఎడ్యుకేషన్/ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, డీమోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎకానమీ, రూరల్ డెవెలప్‌మెంట్ ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, మేనేజ్‌మెంట్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, జాగ్రఫీ తదితరాలు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ-జేఆర్‌ఎఫ్/నెట్, గేట్‌లో ఏదైనా ఒక దానిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: జాతీయ అర్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 18-11-2025.
ఇంటర్వ్యూ తేదీ: 26.11.2025.
సెలెక్టడ్ అభ్యర్థుల జాబితా విడుదల: 28.11.2025.