ఐవోసీఎల్‌ వెస్ట్రన్‌ రీజియన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఐవోసీఎల్‌ వెస్ట్రన్‌ రీజియన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) మార్కెటింగ్‌ డివిజన్ పరిధిలోని వెస్ట్రన్‌ రీజియన్‌లలో టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌, ట్రేడ్‌ (టెక్నికల్/ నాన్-టెక్నికల్‌ విభాగాల్లో) అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 405 

వివరాలు:

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌

ట్రేడ్‌ అప్రెంటిస్‌

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌

ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ&ఐ, ఇన్‌స్ట్రుమేంటేషన్‌, సివిల్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 31.12.2025 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31.01.2026.

Website:https://iocl.com/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram