నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్‌పుర్ (ఎన్‌ఈఆర్) వివిధ యూనిట్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం పోస్టుల సంఖ్య: 1104
వివరాలు:
1. మెకానికల్ వర్క్‌షాప్/గోరఖ్‌పుర్: 390
2. సిగ్నల్ వర్క్‌షాప్/గోరఖ్‌పుర్: 63
3. బిడ్జి వర్క్‌షాప్/గోరఖ్‌పుర్: 35
4. మెకానికల్ వర్క్‌షాప్/ఇజ్జత్‌నగర్: 142
5. డీసిల్ షెడ్/ఇజ్జత్‌నగర్: 60
6. క్యారేజ్ & వ్యాగన్/ఇజ్జత్‌నగర్: 64
7. క్యారేజ్ & వ్యాగన్/ లఖ్‌నవూ: 149
8. డీసిల్ షెడ్/గోండ: 88
9. క్యారేజ్ & వ్యాగన్/వారణాసి: 73
10. టీఆర్‌డీ వారణాసి: 40
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 అక్టోబర్ 16వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 15.
Website: https://ner.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,7,288,366,932