చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషిన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 25
వివరాలు:
1. డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్: 08
2. గ్రాడ్యుయేట్ (డిగ్రీ/బీటెక్) అప్రెంటిస్: 17
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్‌కు 18 - 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 21 - 26 ఏళ్లు.
స్టైపెండ్: నెలకు డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.13,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 అక్టోబర్ 27.