హెచ్‌ఏఎల్‌ హైదరాబాద్‌లో విజిటింగ్‌ డాక్టర్‌ పోస్టులు

హెచ్‌ఏఎల్‌ హైదరాబాద్‌లో విజిటింగ్‌ డాక్టర్‌ పోస్టులు

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌ ), హైదరాబాద్‌లోని తన 'ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్' కోసం పార్ట్-టైమ్ ప్రాతిపదికన విజిటింగ్ డాక్టర్ల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

విజిటింగ్‌ డాక్టర్స్‌: 05 

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) కలిగి ఉండాలి. పోస్టును బట్టి కనీసం 2 నుంచి 5 ఏళ్ల వరకు క్లినికల్ అనుభవం ఉండాలి.

వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 65 ఏళ్లలోపు ఉండాలి. 

పనివేళలు & వేతనం: విజిటింగ్ డాక్టర్లు వారానికి నిర్దేశించిన రోజులు (1 నుంచి 3 రోజులు) & గంటల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. గంటకు రూ.600 నుంచి రూ.2,500 వరకు గౌరవ వేతనంతో పాటు కన్వేయన్స్ ఛార్జీలు చెల్లిస్తారు. 

నియామక కాలం: ఈ నియామకాలు ప్రారంభంలో రెండేళ్ల కాలానికి ఉంటాయి. అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం: కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారిని వారి విద్యార్హతలు & అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం:

అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను 'Chief Manager (HR), HR Department, Avionics Division, Post-HAL, Hyderabad-500042' చిరునామాకు పంపాలి. 

దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 31.03.2026.

Website: https://hal-india.co.in/home

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram