ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీలో ఉద్యోగాలు

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీలో ఉద్యోగాలు

మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్‌)కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీ, మధ్యప్రదే ఒప్పంద ప్రాతిపదికన 'కెమికల్ ప్రాసెస్ వర్కర్' పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

కెమికల్ ప్రాసెస్ వర్కర్ (సీపీడబ్ల్యూ): 265 ఖాళీలు

(జనరల్‌-108; ఓబీసీ- 39, ఎస్సీ-39, ఎస్టీ-53, ఈడబ్ల్యూఎస్‌-26, ఎక్స్-సర్వీస్‌మెన్-26)

అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా ఏఓసీపీ (Attendant Operator Chemical Plant) ట్రేడ్‌లో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఒకవేళ ఏఓసీపీ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, ఫీడర్ ట్రేడ్స్ (Fitter, Machinist, Turner, Electrician, మొదలైనవి) అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సర్టిఫికేట్ ఎన్‌సీవీటీ లేదా ఎన్‌సీవీఈటీ ద్వారా జారీ చేసీ ఉండాలి.

మూల వేతనం: నెలకు రూ.19,900.

వయస్సు పరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదు సంవత్సరాలు; ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఎన్‌సీటీవీటీ (ఎన్‌ఏసీ) పరీక్ష మార్కులు, ట్రేడ్ టెస్ట్ మార్కుల తదితరాలు ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.

చిరునామా: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకొని దానిని పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీ, నర్మధపురం జిల్లా, మధ్యప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2026.

Website:https://ddpdoo.gov.in/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram