ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రాయ్‌పుర్‌ వివిధ విభాగాలలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మొదలైన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 92  

వివరాలు:

1. ప్రొఫెసర్ - 23  

2. అడిషనల్ ప్రొఫెసర్ - 23  

3. అసోసియేట్ ప్రొఫెసర్ - 31 

4. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 15  

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ప్రొఫెసర్/అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.  వేతనం:ప్రొఫెసర్: రూ.1,68,900 - రూ.2,20,400.  అసిస్టెంట్

ప్రొఫెసర్: రూ.1,01,500 - రూ.1,67,400. 

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ  అభ్యర్థులకు రూ.3,000. ఎస్సీ/ఎస్టీ  అభ్యర్థులకు రూ.2,400.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు చివరి తేదీ: 15.05.2026

Website:https://www.aiimsraipur.edu.in/user/vacancies-desc.php?descscr=873&desctype=Advrt

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram