రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆఫీసర్స్‌ గ్రేడ్‌-బి పోస్టులు

రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆఫీసర్స్‌ గ్రేడ్‌-బి పోస్టులు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా గల వివిధ జోన్లలో ఆఫీసర్స్‌ గ్రేడ్‌-బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 60

వివరాలు:

ఆఫీసర్స్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌)-జనరల్‌: 40 

ఆఫీసర్స్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌)- డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ: 10 

ఆఫీసర్స్‌ గ్రేడ్‌-బి (డీఆర్‌)-స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌: 10 

అర్హతలు: కనీసం 65శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్‌/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ.78,450- రూ.1,41,900.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఫేజ్‌-1, ఫేజ్‌-2 రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.850+జీఎస్‌టీ; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100+జీఎస్‌టీ.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.04.2026.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.05.2026.

ఫేజ్‌-1 పరీక్ష (జనరల్‌): 13.06.2026.

ఫేజ్‌-1 పరీక్ష (డీఈపీఆర్‌/డీఎస్‌ఐఎం): 14.06.2026.

ఫేజ్‌-2 పరీక్ష (జనరల్‌): 25.07.2026.

ఫేజ్‌-2 పరీక్ష (డీఈపీఆర్‌/డీఎస్‌ఐఎం): 26.07.2026.

Website:https://opportunities.rbi.org.in/scripts/vacancies.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram