భారత వాతావరణ శాఖ (ఐఎండీ)

భారత వాతావరణ శాఖ (ఐఎండీ)

సువిశాల భూభాగం ఉన్న భారతదేశం విభిన్న వాతావరణ పరిస్థితులతోపాటు వేర్వేరు శీతోష్ణస్థితి ప్రాంతాలను కలిగి ఉంది. తీవ్రమైన ఎండలు, అధిక చలి, కుండపోత వర్షాలు, కరవు ఛాయలు లాంటివన్నీ దేశంలో కనిపిస్తుంటాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే మూలాధారం కాగా, అది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి సాగుతుంది. భారతదేశ వాతావరణ సమాచారాన్ని భారత వాతావరణ శాఖ (ఇండియన్‌ మెటియోరాలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ - ఐఎండీ) అధ్యయనం చేస్తుంది. పోటీపరీక్షల నేపథ్యంలో దీని గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

చారిత్రక నేపథ్యం

  • భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే వాతావరణశాస్త్రంపై అధ్యయనం జరిగింది. మన పురాణాలు, ఉపనిషత్తుల్లో మేఘాల ఏర్పాటు, వర్షం కురవడం, సూర్యుడి చుట్టూ భూమి తిరగడం వల్ల వచ్చే కాలానుగుణ చక్రాలు మొదలైన సమాచారం ఉంది. క్రీ.శ.500 కాలంలో వరాహమిహిరుడు రచించిన ‘బృహత్‌ సంహిత’ గ్రంథంలో నాటి వాతావరణ ప్రక్రియల గురించి ఉంది.
  • కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ వర్షపాతం శాస్త్రీయ కొలతల గురించి పేర్కొన్నారు. క్రీ.శ.అయిదో శతాబ్దంలో కాళిదాసు రచించిన ‘మేఘదూత’ కావ్యంలో మధ్య భారతదేశంలోకి రుతుపవనాలు ప్రవేశించే తేదీని ప్రస్తావించారు. రుతుపవన మేఘాల మార్గాన్ని వివరించారు. 
  • 1636లో బ్రిటిష్‌ శాస్త్రవేత్త ఎడ్మండ్‌ హేలీ భారతదేశ రుతుపవనాలపై ఒక గ్రంథాన్ని ప్రచురించారు. 

ఏర్పాటు 

  • భారత్‌లో వాతావరణం, శీతోష్ణస్థితిని అధ్యయనం చేసేందుకు బ్రిటిష్‌వారు కోల్‌కత్తా (1785), మద్రాస్‌ (1796), బొంబాయి (1804)లో కేంద్రాలు నెలకొల్పారు.
  • 1864లో సంభవించిన భయంకర తుపాను, అనంతరం 1866, 1871 సంవత్సరాల్లో రుతుపవనాల వైఫల్యం కారణంగా సంభవించిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భారత వాతావరణ శాఖ ఆవిర్భావానికి బాటలు వేశాయి. 
  • 1875, జనవరి 15న అవిభక్త భారతదేశంలో (పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌) వాతావరణ విభాగం 77 వర్షమానినిలు  ఏర్పాటు చేసింది. వీటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హెచ్‌.ఎఫ్‌.బ్లాన్‌ఫోర్డ్‌ అనే బ్రిటిష్‌ అధికారి తొలిసారిగా దేశ వర్షపాత పటాన్ని రూపొందించారు.
  • ఐఎండీ ప్రధాన కార్యాలయం 1889లో కోల్‌కతాలో ఉండగా 1905లో సిమ్లాకు, 1928లో పుణెకు మార్చారు. 1944లో దీన్ని న్యూ దిల్లీకి మార్చారు. ఐఎండీ ప్రధాన కార్యాలయాన్ని ‘మౌసమ్‌ భవన్‌’ అంటారు. 
  • ఇది మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ అధీనంలో పనిచేస్తుంది. 
  • ఐఎండీకి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటియోరాలజీ అధిపతిగా ఉంటారు. ప్రస్తుతం మృత్యుంజయ్‌ మహాపాత్ర ఆ స్థానంలో ఉన్నారు (2019, ఆగస్టు 1 నుంచి 2026, జనవరి 14 నాటికి)

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)

Q: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కేంద్ర ప్రభుత్వంలోని కింది ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది?

1) కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ

2) భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ

3) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ

4) ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ

సమాధానం: 2

(ఆర్‌ఎస్‌ఎంఎస్‌ఎస్‌బీ అగ్రికల్చర్‌ సూపర్‌వైజర్, 2021)

Q: భారత వాతావరణ శాఖ 1875లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఉంది?

1) జైపూర్‌         2) పుణె         3) న్యూ దిల్లీ        4) కోల్‌కతా

సమాధానం: 4

(UPPSC Civil Service 2018)

Q: Arrange the following India Meteorological Headquarters in Chronological order of their establishment and select your correct answer from the codes given below:
A. New Delhi
B. Kolkata
C. Shimla
D. Pune
1) C D A B      2) B A D C      3) D B C A         4) B C D A
Answer: 4

(SSC MTS, 2019)

Q: Which of the following books is written by Varaha Mihira?
1) Brihat Samhita     2) Ritusamhara        3) Shakuntala       4) Kumarasambhava
Answer: 1

 

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram