దేశంలో ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు/ డ్యామ్‌లు

దేశంలో ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు/ డ్యామ్‌లు

భారత్‌ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. నేటికీ అధిక శాతం ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి నీరు ప్రధాన సహజ వనరు. సంవత్సరం పొడవునా దీనికి నీళ్లు అవసరం. పూర్వం వ్యవసాయం వర్షాధారంగా సాగేది. అయితే దేశంలో వర్షపాతం కొన్ని నెలలకే పరిమితం. రుతుపవనాలు అనుకూలంగా లేకపోతే అదీ కష్టమే. వర్షాభావ పరిస్థితులను అధిగమించి పంటలకు కృత్రిమంగా మానవ ప్రయత్నం ద్వారా నీరు అందించడాన్ని ‘నీటిపారుదల’ అంటారు. జనాభా పరంగా భారత్‌ ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉంది. వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహారం, ప్రాథమిక నిత్యావసర వస్తువులు అందించడానికి నీటిపారుదల అవసరం. అందుకోసమే చెరువుల తవ్వకం, ఆనకట్టలు, రిజర్వాయర్లు, డ్యామ్‌ల నిర్మాణం జరుగుతోంది.

ప్రాజెక్టులు ఎందుకు?

  • వ్యవసాయం ప్రధానమైన భారతదేశం భూగోళంలో ఉత్తరార్ధ భాగంలో ఉప ఆయన మండలం (సబ్‌ ట్రాపికల్‌ రీజియన్‌)లో ఉంది. దీంతో మనకు నీటి ఆవశ్యకత చాలా ఎక్కువ. దేశ వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉండటంతో కొన్నిసార్లు ఎక్కువగా మరికొన్నిసార్లు సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుంది. దేశవ్యాప్తంగా వర్షపాతంలో విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల సౌకర్యం కల్పించాల్సి వస్తోంది. 

బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటే?

  • నదీ ప్రవాహాలను నియంత్రించి, ఆ నీటిని వ్యవసాయానికి మళ్లించే భారీ ఆనకట్టలను సాగు నీటి ప్రాజెక్టులు అంటారు. వాటి ద్వారా కరవు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
  • బహుళార్థ సాధక నదీ ప్రాజెక్టులు అంటే కేవలం నీటిపారుదల అవసరాలను తీర్చడమే కాకుండా ఎన్నో ఇతర ప్రయోజనాలను సైతం అందిస్తాయి. విద్యుత్‌ ఉత్పాదన, వరదలు అరికట్టడం, జల రవాణా, తాగునీటి సరఫరా, పరిశ్రమల నీటి అవసరాలు తీర్చడం, మత్స్య సంపద వృద్ధి, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ఇవి తోడ్పడతాయి. వీటిలో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. దీంతో వర్షాభావ పరిస్థితులనూ సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. కరవుల వల్ల జరిగే నష్టాలను నివారించవచ్చు.
  • దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. 

వర్గీకరణ

  • వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న మార్గంలో ఆనకట్ట కట్టి, నిల్వ చేస్తారు. ఆ నీటిని కావాల్సిన ప్రాంతాలకు కాలువలు, గొట్టాల ద్వారా సరఫరా చేస్తారు.
  • ప్రాజెక్టులను వాటి ఆయకట్టు ఆధారంగా వర్గీకరించారు. 10 వేల హెక్టార్ల కంటే ఎక్కువ భూములకు నీరు అందించే వాటిని భారీ నీటిపారుదల ప్రాజెక్టులు; 2 వేల నుంచి 10 వేల హెక్టార్ల వరకు నీరందించే వాటిని మధ్యతరహా నీటి ప్రాజెక్టులు; 2 వేల కంటే తక్కువ హెక్టార్ల భూమికి నీరు అందించే వాటిని చిన్నతరహా నీటి ప్రాజెక్టులు అంటారు. 

ఆవశ్యకత

  • దేశాభివృద్ధికి బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఎంతో అవసరం. ఇవి మిలియన్ల కొద్దీ హెక్టార్లకు నీరివ్వడంతో పాటు, విద్యుత్‌ ఉత్పాదన, వినోద విహారాలు లాంటి బహుళ ప్రయోజనాలను అందిస్తాయి. తాగునీరు, సాగునీరు, వరద నివారణ, జలరవాణా, విహార యాత్రలు, మత్స్య సంపద అభివృద్ధి, భూసార సంరక్షణ, కృత్రిమ వనాల పెంపకం లాంటి ఎన్నో ప్రయోజనాలు బహుళార్థ సాధక ప్రాజెక్టుల వల్ల కలుగుతున్నాయి.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ను కింది ఏ నదిపై నిర్మించారు?

(ఏఎఫ్‌సీఏటీ, 2021), (ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2022)

1) నర్మద       2) తపతి        3) మహి        4) కర్ణన్‌

సమాధానం: 1

ప్రశ్న: రిహండ్‌ ప్రాజెక్టు కింది ఏ రాష్ట్రంలో ఉంది?

(యూపీఆర్‌వీయూఎన్‌ఎల్‌ టీజీ 2 మెకానికల్‌ ఫిట్టర్, 2015)

1) గుజరాత్‌         2) ఉత్తర్‌ ప్రదేశ్‌

3) మధ్యప్రదేశ్‌       4) పశ్చిమ బెంగాల్‌

సమాధానం: 2

Q: The first dam in India was built around:
(PSPCL LDC, 2019)
1) 1947            2) 2nd century AD
3) 1953            4) 1st century AD
Ans: 2 
Q: The first multi - purpose project of India was
(Bihar Sakshamta Pariksha (Class 1-5), 2024), 
(SSC JE EE, 2016)
1) Sivasamudram        2) Damodar Valley
3) Hirakud                   4) Rajasthan Canal
Ans: 2

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram