అంతర్జాతీయ ద్రవ్య నిధి

అంతర్జాతీయ ద్రవ్య నిధి

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) ఒకటి. ప్రపంచ దేశాలు స్థిరమైన వృద్ధి, శ్రేయస్సును సాధించేందుకు అవసరమైన సాయాన్ని ఇది అందిస్తుంది. ఉత్పాదకత, ఉద్యోగ సృష్టి, వృద్ధిని పెంచేందుకు కావల్సిన ఆర్థిక విధానాలను రూపొందిస్తుంది. సంక్షోభంలో చిక్కుకున్న దేశాలు స్థిరత్వాన్ని సాధించేలా ఇది ఊతమిస్తుంది. రుణాలు ఇవ్వడంతో పాటు సంబంధిత దేశాలు మాంద్యం పరిస్థితి నుంచి బయటపడేలా తగిన ఆర్థిక సంస్కరణలు, విధాన మార్పులను సూచిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక పాత్ర కలిగిన సంస్థగా ఐఎంఎఫ్‌కు పేరుంది. ఆర్థిక మార్గాల ద్వారా ప్రపంచ శ్రేయస్సు, శాంతిని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పోటీ పరీక్షల నేపథ్యంలో ఐఎంఎఫ్‌కి సంబంధించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

ఏర్పాటు ఇలా..

  • 1920-30 కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహామాంద్యం ఏర్పడింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. మాంద్య పరిస్థితుల వల్ల అంతర్జాతీయ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడింది. దేశాల ఆర్థిక వ్యవస్థల రక్షణ కోసం ప్రతి దేశం ఎక్కువ మొత్తంలో దిగుమతి సుంకాలు విధించేది. ఫలితంగా అంతర్జాతీయ వ్యాపారం క్షీణించింది.
  • వీటన్నింటికీ పరిష్కార మార్గాలు కనుక్కునేందుకు ప్రపంచ దేశాలు 1944, జులై 22న అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌ రాష్ట్రంలో ఉన్న బ్రెట్టన్‌ ఉడ్స్‌ నగరంలో సమావేశమయ్యాయి. ‘యూఎన్‌ మానిటరీ అండ్‌ ఫైనాన్షియల్‌ కాన్ఫరెన్స్‌’ అనే పేరుతో జరిగిన సదస్సులో ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలను ఏర్పాటు చేసే ఒప్పందం కుదిరింది. వీటినే బ్రెట్టన్‌ ఉడ్స్‌ కవలలు అంటారు.
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)ను 1944, జులై 22న స్థాపించారు. ఇది 1945, డిసెంబరు 27 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు 1947, మార్చి 1 నుంచి ప్రాంభమయ్యాయి. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌ డి.సి.లో ఉంది.

విత్త సహాయం

  • ఐఎంఎఫ్‌ సభ్య దేశాలకు రెండు రకాలుగా విత్త సాయం అందిస్తుంది. అవి: 1. రాయితీ రుణాలు  2. రాయితీ లేని రుణాలు  

1. రాయితీ రుణాలు: అల్పాదాయం ఉన్న సభ్యదేశాలకు రాయితీ రుణాలను సున్నా వడ్డీరేటుకు పావర్టీ రిడక్షన్‌ అండ్‌ గ్రోత్‌ ట్రస్ట్‌ (పీఆర్‌జీటీ) కింద అందిస్తారు. అవి:

ఎ. స్టాండ్‌ బై క్రెడిట్‌ ఫెసిలిటీ (ఎస్‌సీఎఫ్‌)  

బి. ఎక్స్‌టెండెడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీ (ఈసీఎఫ్‌)  

సి. ర్యాపిడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీ (ఆర్‌సీఎఫ్‌)  

2. రాయితీ లేని రుణాలు: సభ్య దేశాలకు మార్కెట్‌ వడ్డీరేటుకు రుణ  సౌకర్యం కల్పిస్తారు. అవి:

ఎ. స్టాండ్‌ బై అరేంజ్‌మెంట్‌  

బి. ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ

సి. ర్యాపిడ్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (ఆర్‌ఎఫ్‌ఐ)

డి. ఫ్లెక్సిబుల్‌ క్రెడిట్‌ లైన్‌ (ఎఫ్‌సీఎల్‌)

ఇ. ప్రికాషనరీ అండ్‌ లిక్విడిటీ లైన్‌ (పీఎల్‌ఎల్‌)

ఐఎంఎఫ్‌కి నిధులు

ఐఎంఎఫ్‌కి మూడు రూపాల్లో నిధులు సమకూరుతాయి. అవి:

1. సభ్య దేశాల కోటా: ఇది ఐఎంఎఫ్‌కు విత్త వనరుగా ఉపయోగపడుతుంది. ఇది ఎస్‌డీఆర్‌ల రూపంలో ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ సాపేక్ష ప్రాధాన్యం ఆధారంగా కోటా నిర్ణయిస్తారు.

2. న్యూ అరేంజ్‌మెంట్‌ టు బారో (ఎన్‌ఏబీ): 40 సభ్యదేశాల నుంచి ఎన్‌ఏబీ ద్వారా రుణాలు తీసుకుంటుంది.

3. ద్వైపాక్షిక రుణ ఒప్పందాలు: కోటా, ఎన్‌ఏబీల తర్వాత సభ్యదేశాల విత్త అవసరాలు తీర్చేందుకు ఐఎంఎఫ్‌ ఈ రుణ ఒప్పందాలు చేసుకుంటుంది. దీనిలో కూడా 40 దేశాలు ఉన్నాయి.

ప్రధాన నివేదికలు

ఐఎంఎఫ్‌ ఏడాదికి రెండుసార్లు వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ), గ్లోబ్‌ ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ రిపోర్ట్‌లను ప్రచురిస్తుంది. ప్రభుత్వ విత్త అభివృద్ధిని విశ్లేషించే ఫిస్కల్‌ మానిటర్‌ రిపోర్ట్, అలాగే ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల బహిర్గత స్థితిని అంచనా వేసే ఎక్స్‌టర్నల్‌ సెక్టార్‌ రిపోర్ట్‌ని విడుదల చేస్తుంది. ఇక రీజినల్‌ ఎకనామిక్‌ రిపోర్ట్‌ ప్రత్యేక ప్రాంతంలో దేశాల ఆర్థికాభివృద్ధి అవకాశాలను తెలియజేస్తుంది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (దిల్లీ ఫారెస్ట్‌ గార్డ్, 2021)

1) జెనీవా       2) లండన్‌

3) పారిస్‌       4) వాషింగ్టన్‌ డి.సి.

సమాధానం: 4

Q: When was the Bretton Woods Agreement signed by the delegates which led to the establishment of the IMF?
(MPPSC Assistant Prof Economics Paper II, 2024)
1) July, 1944               2) August, 1944
3) November, 1944      4) December, 1944
Ans: 1
Q: After US dollar, which of the following currencies has largest weightage in determining the value of SDR?
(UGC Paper 2: Commerce, 2019)
1) Japanese Yen            2) Chinese Yuan (Renminbi)
3) Euro                4) British Pound
Ans: 3
Q: Bretton Woods Conference resulted into the establishment of which of the following?
(UGC Paper 2: Commerce, 2018)
1) IMF and IDA           2) IBRD and IFC
3) IDA and ADB          4) IMF and IBRD
Ans: 4

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram