భారత జాతీయ కాంగ్రెస్‌

భారత జాతీయ కాంగ్రెస్‌

దేశ స్వాతంత్య్రోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) పాత్ర మరువలేనిది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో ఇది కీలకంగా వ్యవహరించింది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడంతోపాటు భారతీయుల హక్కుల కోసం పోరాడి, వారిని చైతన్యవంతులుగా చేసేందుకు ఐఎన్‌సీ కృషి చేసింది. ఆంగ్లేయుల విధానాలను చర్చించడానికి, ముఖ్యమైన సమస్యలపై తీర్మానాలు చేయడానికి ఐఎన్‌సీ సమావేశాలు నిర్వహించేది. అందులో స్వాతంత్య్ర పోరాటాలకు సంబంధించిన మార్గదర్శక నిర్ణయాలు తీసుకునేవారు. జాతీయోద్యమంలో అవి ఎంతగానో తోడ్పడ్డాయి. జాతీయవాదానికి, భారతీయుల రాజకీయ పోరాటాలకు ఒక జాతీయ వేదికగా 1885, డిసెంబరు 28న ఐఎన్‌సీ ఏర్పాటైంది. పోటీపరీక్షల నేపథ్యంలో ఐఎన్‌సీ ఏర్పాటు, ముఖ్యమైన సమావేశాలు - అధ్యక్షుల గురించిన ముఖ్య విషయాల గురించి తెలుకుసుందాం..!

భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఏర్పాటు

  • దేశవ్యాప్తంగా ఉన్న విద్యావంతులు, జాతీయవాద రాజకీయ కార్యకర్తల కోసం ఒక అఖిల భారత సంస్థ ఉండాలని సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనందమోహన్‌ బోస్, ఉమేష్‌చంద్ర బెనర్జీ, దాదాభాయ్‌ నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా, కె.టి.తెలాంగ్, ఎం.జి.రనడే లాంటి ప్రముఖులు భావించారు.
  • దేశానికి ఒక సమర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడం, ఆర్థిక - సామాజిక సంస్కరణల ఆవశ్యకత మొదలైన అంశాలతోపాటు బ్రిటిష్‌ వలస పాలనపై పెరుగుతున్న అసంతృప్తిని జాతీయోద్యమంగా మలచాలని వారు సంకల్పించారు. అంతేకాక వారు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి, అర్థవంతమైన మార్పు కోసం వాదించడానికి ఒక జాతీయ వేదికను ఏర్పాటు చేయాలనుకున్నారు.
  • అయితే వారి ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేసింది మాత్రం ఆంగ్లేయుడైన రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్‌ అలెన్‌ ఆక్టావియన్‌ హ్యూమ్‌ (ఏఓ హ్యూమ్‌). ఈయన 1883లో కలకత్తా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లకు బహిరంగ లేఖ రాశారు. అందులో అఖిల భారత రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను పేర్కొన్నారు.
  • 1885లో ‘భారత జాతీయ యూనియన్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాదాభాయ్‌ నౌరోజీ సూచన మేరకు అందులో ‘యూనియన్‌’ పదాన్ని తొలగించి ఆ స్థానంలో కాంగ్రెస్‌ను చేర్చారు.

తొలి సమావేశం.. లక్ష్యాలు..

  • ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ మొదటి సమావేశం 1885, డిసెంబరు 28న బొంబాయిలోని గోకులాదాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత పాఠశాలలో జరిగింది. ఆ రోజే ఐఎన్‌సీ స్థాపనను సూచిస్తుంది. ఉమేశ్‌ చంద్ర బెనర్జీ (డబ్ల్యూసీ బెనర్జీ) సమావేశానికి అధ్యక్షత వహించారు. దీనికి దేశం నలుమూలల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

తొలి సమావేశంలో ప్రకటించిన ప్రాథమిక లక్ష్యాలు:

  • దేశ ప్రజల మధ్య సాన్నిహిత్యం, స్నేహభావాన్ని పెంపొందించడం.
  • జాతి, మతం, ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల భేదభావాలను రూపుమాపడం.
  • జాతీయ సమైక్యతా భావాలు వ్యాపింపజేయడం, పటిష్ఠపరచడం.  
  • సమాజంలోని ప్రధాన సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి అవసరమైన పద్ధతులను నిర్ణయించి ఆచరించడం.
  • ప్రజల కోరికలు గుర్తించి ప్రభుత్వానికి నివేదించడం.  
  • ప్రజా ప్రయోజనాల కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: గాంధీజీ కింది ఏ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? (ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్, 2019)

1) 1923 కాకినాడ సమావేశం        2) 1925 కాన్పూర్‌ సమావేశం

3) 1924 బెల్గాం సమావేశం        4) 1926 గౌహతి సమావేశం

సమాధానం: 3

ప్రశ్న: భారత జాతీయ కాంగ్రెస్‌ను ఎవరు స్థాపించారు? (సీయూఈటీ, 2022)

1) డబ్ల్యూసీ బెనర్జీ         2) ఏఓ హ్యూమ్‌

3) ఎంకే గాంధీ         4) జేఎల్‌ నెహ్రూ

సమాధానం: 2

Q: In which of the following sessions of the Indian National Congress did George Yule become the President in 1888? (SSC CGL 2022)
1) Calcutta        2) Allahabad
3) Madras           4) Bombay
Ans: 2
Q: ______ was elected as President of the Indian National Congress in December 1929 at its annual session in the city of Lahore. (SSC CPO, 2020)
1) Sardar Vallabhbhai Patel            2) Subhas Chandra Bose
3) Jawaharlal Nehru                4) Lal Bahadur Shastri
Ans: 3

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram