భారత్‌లో బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లు

భారత్‌లో బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లు

భూమిపై కప్పి ఉన్న జలావరణాన్ని స్థూలంగా మహా సముద్రాలు, సముద్రాలు అని పిలుస్తారు. పర్యావరణానికి, జీవవైవిధ్య పరిరక్షణకే కాదు.. ఆర్థికంగానూ ఇవి ఎంతగానో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా బీచ్‌లు ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తాయి. అయితే ఇవి కాలుష్యం, రద్దీ, వ్యర్థాలు పేరుకుపోవడం లాంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటిని అధిగమిస్తూ, తీర ప్రాంత జలాల్లో సుస్థిరాభివృద్ధి సాధనే లక్ష్యంగా బ్లూఫ్లాగ్‌ బీచ్‌లు పని చేస్తున్నాయి. పరిశుభ్రంగా, సురక్షితంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నట్లు ఎకో-లేబుల్డ్‌ సర్టిఫికెట్‌ పొందిన బీచ్‌లను ‘బ్లూఫ్లాగ్‌ బీచ్‌లు’ అంటారు. పోటీపరీక్షల నేపథ్యంలో వీటి సంబంధించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌

  • బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ అనేది అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఎకో-లేబుల్డ్‌ సర్టిఫికెట్‌. దీన్ని బీచ్‌లు, మెరీనాలు (Marinas), స్థిరమైన బోటింగ్‌ ఆపరేటర్లకు (sustainable boating operators)  ఇస్తారు. 
  • డెన్మార్క్‌కి చెందిన పర్యావరణ అవగాహన సంస్థ ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌’ (ఎఫ్‌ఈఈ) బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌లు ఇస్తుంది. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ), యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ (యూఎన్‌డబ్ల్యూటీఓ), ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌ (ఐయూసీఎన్‌) సభ్యులతో కూడిన అంతర్జాతీయ జ్యూరీ.. 33 ప్రమాణాలను రూపొందిస్తుంది. కొన్నేళ్ల పాటు వాటిని విజయవంతంగా నిర్వహించడంపై సంతృప్తి చెందితేనే బ్లూఫ్లాగ్‌ గుర్తింపు లభిస్తుంది. 
  • ఈ సర్టిఫికెట్‌ కాలపరిమితి ఏడాది. ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ఏటా తనిఖీలు జరిపి నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తున్నట్లు తేలితేనే బ్లూఫ్లాగ్‌ హోదా పునరుద్ధరిస్తారు. లేకుంటే రద్దు చేస్తారు.
  • బ్లూ ఫ్లాగ్‌ ప్రోగ్రాం మొదట 1985లో ఫ్రాన్స్‌లో పర్యావరణ అవగాహన కార్యక్రమంగా ప్రారంభమైంది. 1987లో ఈ చొరవను ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌’ స్వీకరించి, యూరప్‌ అంతటా ‘యూరోపియన్‌ బ్లూ ఫ్లాగ్‌’గా అమలు చేసింది. 2001లో యూరప్‌ బయట దక్షిణాఫ్రికాలో దీన్ని మొదట ప్రారంభించారు. ఆ సమయంలో ‘ఇంటర్నేషనల్‌ బ్లూ ఫ్లాగ్‌’ పేరుతో అమలు చేశారు.

బ్లూ ఫ్లాగ్‌ సైట్లు ప్రధానంగా ఆరు కీలక అంశాలను కలిగి ఉంటాయి. అవి:

1. విద్య, సమాచారం, భాగస్వామ్యం (Education, Information and Stakeholder Engagement)

2. క్లైమేట్‌ యాక్షన్‌

3. జీవవైవిధ్య నిర్వహణ (Biodiversity Management)

4. కాలుష్య నిర్వహణ, నీటి నాణ్యత (Pollution Management and Water Quality)

5. యాక్సెసబిలిటీ

6. భద్రత, సేవలు (Safety and Services)

ప్రపంచవ్యాప్తంగా..

  • 2025, నవంబరు 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 5216 బ్లూ ఫ్లాగ్‌ అవార్డెడ్‌ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో 4,323 బీచ్‌లు, 738 మెరీనాలు, 155 బోటింగ్‌ ఆపరేటర్లు ఉన్నాయి. 

అత్యధిక బ్లూ ఫ్లాగ్స్‌ కలిగిన దేశాలను పరిశీలిస్తే..

ర్యాంక్‌ దేశం బీచ్‌లు   మెరీనాలు  బోటింగ్‌ ఆపరేటర్లు మొత్తం
1 స్పెయిన్‌ 642 101     6 749
2 గ్రీస్‌ 623 17 17 657
3 టర్కీ 577 30 18 625
4 ఇటలీ 487 84 0 571
5 ఫ్రాన్స్‌ 388 104 1 493


భారతదేశంలో బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ ప్రాంతాలు

  • భారతదేశం మొత్తం తీర రేఖ పొడవు 7516.6 కి.మీ. మొత్తం 9 రాష్ట్రాల్లో సముద్ర తీరం ఉంది. అవి: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌. 2025, నవంబరు 30 నాటికి మన దేశంలో 18 బీచ్‌లకు బ్లూ స్టార్‌ సర్టిఫికెట్‌ ఉంది. దేశంలోని మెరీనాలు, బోటింగ్‌ ఆపరేటర్లకు ఎలాంటి గుర్తింపు లేదు.

గతపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(కర్ణాటక పోలీస్‌ ఎస్‌ఐ, 2022)

Q: బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ కింది వాటిలో దేనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు?

1) మంచి నాణ్యత కలిగిన ఆహార ఉత్పత్తులు

2) పర్యావరణ అనుకూల, శుభ్రమైన బీచ్‌లు

3) ఉత్తమ ఐటీ సేవ

4) హరితభవనాలు

సమాధానం: 2

(WBCS Prelims 2020)
Q:
Which of the following is the first beach in Asia to get Blue-Flag certification?
1) Arambol beach, goa
2) Chandrabhaga beach, Odish
3) Chiwala beach, Maharashtra
4) None of the above
Answer: 2

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram