భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ

భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ

దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత్‌లో ప్రైవేట్‌ రంగానికి చెందిన బ్యాంకులే ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేది కాదు. కొంతమంది ధనికులకు, వ్యాపారులకు మాత్రమే బ్యాంకింగ్‌ సదుపాయాలు అందుబాటులో ఉండేవి. ఆశించిన రీతిలో ఆర్థికాభివృద్ధి జరగలేదు. దీంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1969లో మొదటిసారి, 1980లో రెండోసారి బ్యాంకులను జాతీయం చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది బ్యాంకింగ్‌ వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులకు కారణమైంది. పోటీపరీక్షల నేపథ్యంలో వీటికి సంబంధించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

జాతీయీకరణ ఎందుకు?

  • భారత్‌లో పారిశ్రామిక  లైసెన్సింగ్‌ వ్యవస్థ పనితీరును సమీక్షించేందుకు 1967లో హజారే కమిటీని ఏర్పాటు చేశారు. ఇది తన నివేదికలో పరిశ్రమలు, బ్యాంకులకు మధ్య అనుసంధానం లేకపోతే పరపతి ప్రణాళిక తీసుకురావడం కష్టమని పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వం మొదట ‘సోషల్‌ కంట్రోల్‌’ని ప్రవేశపెట్టింది. దీంతో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో 1969, జులై 19న నాటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
  • దీనికి అనుగుణంగా బ్యాంకింగ్‌ కంపెనీస్‌ అక్విజిషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ అనే ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. తర్వాత దాన్ని చట్టం చేశారు.
  • ప్రైవేట్‌ రంగంలో రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 14 వాణిజ్య బ్యాంకులు ఇందులో ఉన్నాయి. దాంతో అప్పటి వరకు ఉన్న 70% బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ప్రభుత్వ అజమాయిషీ కిందికి వచ్చాయి.

లాభాలు:

  • ప్రజలకు బ్యాంకులను చేరువ చేయడంలో, పారిశ్రామిక రంగానికి పెట్టుబడి అవసరాలు తీర్చడంలో, రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల జాతీయీకరణ ఎంతగానో దోహదం చేసింది.
  • గ్రామాలు, పట్టణాలు అనే భేదం లేకుండా ప్రజలంతా బ్యాంకులను ఉపయోగించడం ప్రారంభించారు.
  • దేశ ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రుణ విస్తరణ లాంటి వివిధ భాగాల్లో బ్యాంకులు క్రియాశీల పాత్ర పోషించాయి. 
  • ప్రభుత్వరంగ బ్యాంకులు దేశం నలుమూలలా విస్తరించాయి. 

రెండో విడత బ్యాంకుల జాతీయీకరణ

  • ఇది కూడా ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. దీనివల్ల దేశంలో మొత్తం 80% బ్యాంకులు ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. 1980, ఏప్రిల్‌ 15న రూ.200 కోట్లు అంతకంటే ఎక్కువ రిజర్వ్‌ డిపాజిట్లు ఉన్న 6 బ్యాంకులను జాతీయం చేశారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ మెమరీ బేస్డ్‌ పేపర్, 2022)

Q: 2022 నాటికి దేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి?

1) 22    2) 23    3) 12    4) 14    5) 13

సమాధానం: 3

(SBI Clerk Mains Memory Based Paper, 2020)

Q: Oriental Bank of Commerce and United Bank with which of the following banks? 
1) Canara Bank            2) Syndicate Bank
3) Andhra Bank            4) Punjab National Bank
5) Corporation Bank
Answer: 4

(IB ACIO Grade II, 2021)

Q: With which of the following anchor banks were Oriental Bank of Commerce and United Bank of India merged ?
1) Union Bank of India        2) Canara Bank
3) Indian Bank                4) Punjab National Bank
Answer: 4

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram