చైనాకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చెన్ నింగ్ యాంగ్(103) బీజింగ్‌లో 2025, అక్టోబరు 18న మరణించారు. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో ఉన్న హెఫెయ్‌లో 1922లో యాంగ్ జన్మించారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన అనంతరం బోధనా పదవులను చేపట్టారు. భౌతికశాస్త్రంలో చేసిన కృషికి 1957లో యాంగ్‌కు నోబెల్ బహుమతి లభించింది.