చందమామపై కాలుమోపడానికి వెళుతూ.. ప్రమాదానికి లోనైన అపోలో-13 వ్యోమనౌకను సురక్షితంగా భూమికి చేర్చిన ప్రఖ్యాత వ్యోమగామి జిమ్ లోవెల్ (97) మరణించారు. ఇల్లినోయీ రాష్ట్రంలోని లేక్ ఫారెస్ట్ నగరంలో ఆయన 2025, ఆగస్టు 7న తుదిశ్వాస విడిచినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తెలిపింది. నాలుగుసార్లు రోదసియాత్రలు చేపట్టిన తొలి వ్యోమగామిగా ఆయన గుర్తింపు పొందారు. మొత్తం 715 గంటలపాటు అంతరిక్షంలో ఉన్నారు. జెమినీ-7, జెమినీ-12, అపోలో-8, అపోలో-13 మిషన్ల ద్వారా రోదసిలోకి వెళ్లి వచ్చారు. అపోలో-8లో చందమామను చుట్టివచ్చారు. ఆ తర్వాత అపోలో-13 ద్వారా చంద్రుడి వద్దకు ఒకసారి వెళ్లి వచ్చారు. తద్వారా చంద్రుడిని రెండుసార్లు అత్యంత దగ్గర నుంచి చూసిన తొలి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు.
* 1928 మార్చి 25న క్లీవ్‌లాండ్‌లో జన్మించిన లోవెల్ టీనేజర్‌గా ఉన్నప్పుడు ఆయన తన స్నేహితుడితో కలిసి గన్‌పౌడర్‌తో ఒక రాకెట్‌ను నిర్మించారు. చదువు తర్వాత అమెరికా నౌకాదళంలో పైలట్‌గా చేరిన ఆయన.. తర్వాత వ్యోమగామి అయ్యారు.