భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ విప్లవకారులు - ఏర్పాటు చేసిన సంస్థలు
బ్రిటిష్ వారి నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు వివిధ వర్గాల వారు భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరిలో వామపక్షాలు, మితవాదులు, అతివాదులు, విప్లవ జాతీయవాదులు ఉన్నారు. మితవాదులు రాజ్యంగబద్ధ ఉద్యమం ద్వారా సక్రమ పద్ధతిలో, పరిమిత విమర్శలు - డిమాండ్లతో బ్రిటిష్ వారిపై ఒత్తిడి తెచ్చి స్వాతంత్య్రం సాధించాలనుకున్నారు. అతివాదులు ఉద్యమాల ద్వారా స్వరాజ్యాన్ని పొందొచ్చని భావించారు. వీరిలో లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ముఖ్యులు. విప్లవవాద జాతీయవాదానికి వీరు బలమైన పునాదులు వేశారు.
విప్లవ సంస్థ | స్థాపించిన వారు | సంవత్సరం | ప్రదేశం |
---|---|---|---|
మిత్రమేళా | వి.డి. సావర్కర్ | 1899 | నాసిక్ |
అనుశీలన్ సమితి | సతీష్ చంద్ర బసు, ప్రమతనాథ్ మిశ్రా |
1902 | కలకత్తా |
ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ | శ్యామ్‌జీ కృష్ణవర్మ | 1905 | లండన్ |
ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ | తారక్‌నాథ్ దాస్ | 1907 | కాలిఫోర్నియా |
భారతమాత సంఘం | నీలకంఠ బ్రహ్మచారి, వాంచి అయ్యర్ |
1908 | మద్రాస్ |
గదర్ పార్టీ | లాలా హర్‌దయాళ్ | 1913 | శాన్‌ఫ్రాన్సిస్కో |
హిందుస్థాన్ రిపబ్లిక్ సంఘం | రాంప్రసాద్ బిస్మల్, జోగేశ్ ఛటర్జీ, సచీంద్రనాథ్ సన్యాల్ |
1924 | కాన్పూర్ |