హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా 2025, ఆగస్టు 7న దిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. భారత వ్యవసాయ రంగంలో చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పోషకాహార భద్రత, పంటల్లో భిన్నత్వం, వాతావరణాన్ని తట్టుకునే పంటలు, టెక్నాలజీలు ఈ నాలుగు లక్ష్యాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌కు నివాళిగా ప్రత్యేక నాణేన్ని, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.