భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్‌తో ప్రధాని నరేంద్రమోదీ 2025, అక్టోబరు 9న ముంబయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణరంగ సహకారం, బ్రిటన్ విద్యాసంస్థల ప్రాంగణాలు మనదేశంలో ఏర్పాటు చేసుకోవడం సహా పలు ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత రంగాల్లో సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. విలువైన ఖనిజాలు, కృత్రిమ మేధ, టెలికాం, ఆరోగ్యం, విద్యారంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోనున్నాయి.
బ్రిటన్‌కు చెందిన తొమ్మిది విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లను 2026లో ప్రారంభిస్తాయని మోదీ ప్రకటించారు.