భారత్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రిచర్డ్ మార్లెస్ 2025, అక్టోబరు 9న కాన్‌బెర్రాలో సమావేశమయ్యారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతో పాటు సమాచార పంపిణీలో సహకారానికి సంబంధించి రెండు మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, జలాంతర్గాముల శోధనలో సహకారం, సంయుక్త సైనిక చర్చలకు సంబంధించి మూడు అవగాహ ఒప్పందాల (ఎంవోయూ)పై వారు సంతకాలు చేశారు.